గద్వాల టౌన్, వెలుగు : అప్పుల బాధ, ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గద్వాల పట్టణంలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... ఒడిశా రాష్ట్రానికి చెందిన సరోజ్ (21) గద్వాలలోని ఓ హోటల్‌లో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసిన సరోజ్.. ఆ తర్వాత భీంనగర్‌లో తాను ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అక్కడ కొద్దిసేపు తోటి కార్మికులతో కలిసి హోలీ ఆడాడు.
ఆ తర్వాత మిగతా కార్మికులంతా పనికి వెళ్లగా.. సరోజ్ అక్కడే ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతడి స్నేహితులు ఇంటికి వచ్చి డోర్ కొట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా.. ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న గద్వాల టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి బ్యాంక్ అకౌంట్‌ఫ్రీజ్‌లో ఉందని తెలిపారు. ఆన్‌బైన్ బెట్టింగ్‌లు, అప్పుల బాధ కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడనిభావిస్తున్నారు.
